Vijay Mallya : ఎస్ బీఐ ఎంప్లాయ్ కూతురిని పెళ్లి చేసుకున్న విజయ్ మాల్వా కొడుకు

Vijay Mallya

Vijay Mallya

Vijay Mallya : వ్యాపారవేత్త విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్‌ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్, జాస్మిన్‌లు లండన్‌లో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సిద్ధార్థ్ మాల్యా పెళ్లి చేసుకున్న తన స్నేహితురాలు జాస్మిన్‌ ఎవరా అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఆమె తండ్రి ఓ ఎస్ బీఐ బ్యాంక్ ఎంప్లాయ్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.  వారిద్దరికి చిన్ననాటి స్నేహం ఉండడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకుని పెళ్లి చేసినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ మాల్యా గతేడాది తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్‌ను పెళ్లికి ప్రపోజ్ చేశాడు. హాలోవీన్ పార్టీలో తన ప్రియురాలికి ఈ గిఫ్ట్ ఇచ్చాడు. సిద్ధార్థ్‌కి బాలీవుడ్‌తో అనుభందం ఉంది. అతను గతంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో డేటింగ్ చేశాడు. ఈ జంట ఐపీఎల్ మ్యాచ్‌లలో చాలాసార్లు కలిసి కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లు చూసేందుకు ఇద్దరూ కలిసి తరచూ వెళ్లేవారు.

TAGS