Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే..!

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro New Ticket Prices List : హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ఇటీవల టికెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించింది. గతంలో పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త ధరలు ఈ నెల 24వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అయితే, ప్రతి దూరానికి ధరల తగ్గింపు కొద్దిగా వేర్వేరుగా ఉంటుంది.

కొత్త టికెట్ ధరలు..

2 కి.మీ. వరకు: రూ.12 నుంచి రూ.11
4 కి.మీ. వరకు: రూ.18 నుంచి రూ.17
6 కి.మీ. వరకు: రూ.30 నుంచి రూ.28
9 కి.మీ. వరకు: రూ.40 నుంచి రూ.37
12 కి.మీ. వరకు: రూ.50 నుంచి రూ.47
15 కి.మీ. వరకు: రూ.55 నుంచి రూ.51
18 కి.మీ. వరకు: రూ.60 నుంచి రూ.56
21 కి.మీ. వరకు: రూ.66 నుంచి రూ.61
24 కి.మీ. వరకు: రూ.70 నుంచి రూ.65
24 కి.మీ. పైబడి: రూ.75 నుంచి రూ.69
ఈ కొత్త ధరలతో ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనుంది.

TAGS