Vishal : విశాల్ ఆరోగ్య పరిస్థితి ఏంటి.. ఎందుకిలా అవుతుంది?

Vishal : తమిళ నటుడు విశాల్ విల్లుపురంలో జరిగిన ట్రాన్స్ జెండర్ల కార్యక్రమంలో వేదికపై అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, అలసట కారణంగానే ఇలా జరిగిందని విశాల్ టీమ్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, విశ్రాంతి తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. గతంలో కూడా ఒక ఈవెంట్ లో విశాల్ నీరసంగా కనిపించడం తెలిసిందే.ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వాటికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బయటకొచ్చారు. ప్రస్తుతం పని ఒత్తిడి, ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.

TAGS