Bypoll : బైపోల్ లో ఆసక్తి కరమైన గెలుపు ఎక్కడ ఎవరంటే?

bypoll

bypoll

bypoll : రెండు రాష్ట్రాలకు పూర్తి స్థాయి ఎన్నికలతో పాటు 14 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దీనికి సంబంధించి శనివారం (నవంబర్ 23) ఓట్ల లెక్కింపు చేపట్టారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తొలుత 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను ప్రకటించింది. అయితే, సిక్కింలోని రెండు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ లేకుండా 46 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే కౌంటింగ్ జరుగుతోంది. సిక్కింలో, సోరెంగ్-చఖుంగ్, నామ్చి-సింఘితంగ్ స్థానాల ఫలితాలు ఇప్పటికే ప్రకటించారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) నుంచి ఆదిత్య గోలే (తమంగ్) సతీష్ చంద్ర రాయ్ పోటీ లేకుండా గెలుపొందారు.

ఇక ఉప ఎన్నికలు జరిగిన రాష్ట్రాల గురించి తెలుసుకుంటే అస్సాంలో ఐదు నియోజకవర్గా్లలో బైపోల్ నిర్వహించారు. అవి ధోలై, సిడ్లీ, బొగైగావ్, బెహల్, సమగురి ఇక్కడ వరుసగా బీజేపీ, యూపీపీ(ఎల్), ఏజీపీ, బీజేపీ, ఐఎన్‌సీ గెలుపు బాటలో ఉన్నాయి.

బిహార్ లో నాలుగు చోట్ల తరారి, రామ్ ఘర్, ఇమామ్ గంజ్, బెల్గంజ్ ఇక్కడ వరుసగా బీజేపీ, బీజేపీ, హెచ్ఏఎం (ఎస్), జేడీ (యూ) ముందంజలో ఉన్నాయి.

ఛత్తీస్ ఘడ్ లో ఒక నియోజకవర్గం రాయ్‌పూర్ సిటీ సౌత్ కు నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ, గుజరాత్ లో వాక్ లో ఐఎన్‌సీ, కర్ణాటకలో షిగ్గావ్, సండూర్, చన్నపట్నంకు కాంగ్రెస్, కేరళలలో పాలక్కాడ్ కు ఐఎన్ సీ, చెలక్కరలో సీపీఐ (ఎం) విజయం సాధించాయి. ఇక దేశం అంతా ఆసక్తిగా చూస్తున్న వయనాడ్ లో ప్రియాంక గాంధీ విజయం వైపునకు దూసుకుపోతున్నారు.

పశ్చిమ బెంగాళ్ లో సీతై-ఏఐటీసీ, మదారిహత్-ఏఐటీసీ, నైహతి–ఏఐటీసీ, హరోవా-ఏఐటీసీ, మేదినీపూర్-ఏఐటీసీ, తాల్డంగ్రా-ఏఐటీసీ విజయం సాధించాయి.

TAGS