
Samyuktha Menon
Samyuktha Menon : సంయుక్త మీనన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బ్లాక్ బస్టర్.. ఒక వేళ కాదనుకుంటే కనీసం హిట్ టాక్.. కానీ ఆమె నటించిన ఏ సినిమా కూడా ఇప్పటికీ ఫ్లాప్ టాక్ దక్కించుకోలేదు. అందుకే ఇటు టాలీవుడ్ తో పాటు మాలీవుడ్, కొలివుడ్ లో కూడా ఆమెకు గోల్డెన్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.
మలయాళి అయిన సంయుక్త మీనన్ 2016లో ‘పాప్ కార్న్’ సినిమాతో మాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె 2018లో ‘కలరి’తో కోలివుడ్ లో తెరంగేట్రం చేసింది. 2022లో ‘బింభిసార’తో టాలీవుడ్ లో ప్రవేశించిన ఈ చిన్నదాని సినిమాలు ఇప్పటికీ ఒక్కటి కూడా ఫెయిల్ అయ్యింది లేదు. అందుకే టాలీవుడ్ లో సంయుక్తను గోల్డెన్ హీరోయిన్ అన్నారు.
వైజయంతి మూవీ బ్యానర్ పై బింభిసారలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా చేసింది. దీనికి ముందు భీమ్లా నాయక్ లో కమ్లిగా డానియల్ శేఖర్ భార్యగా నటించింది. కానీ ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. బింభిసార నుంచి ఆమె జైత్ర యాత్ర కొనసాగుతూ వచ్చింది. సర్, విరూపాక్ష, డెవిల్ నాలుగు సినిమాలు చేస్తే అందులో నాలుగు బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి.
అందుకే సంయుక్తను గోల్డెన్ హీరోయిన్ అన్నారు. మూడు సినిమాలు హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన డెవిల్ కూడా భారీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సంయుక్త ఖాతాలో మరో సినిమా పడింది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సంయుక్తను గోల్డెన్ హీరోయిన్ అంటూ కితాబిచ్చాడు.