
Krithi Shetty saree cost viral
Krithi Shetty : అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చే హీరోయిన్స్ కి తొలిసినిమాతోనే క్రేజ్ ని దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదు. వేలమందిలో ఒకరిద్దరికి మాత్రమే అలాంటి అవకాశాలు వస్తుంటాయి. అలా ఉప్పెన హీరోయిన్ ‘కృతి శెట్టి’ కి కూడా వచ్చింది. తొలిసినిమా తోనే అందం తో పాటుగా అద్భుతమైన నటన ని చూసి భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎంత టాలెంట్, ఎంత అందం ఉన్నా, ఒక హీరోయిన్ ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే కచ్చితంగా సక్సెస్ రేట్ ముఖ్యం.
ఈమె ఉప్పెన తర్వాత ఎంచుకున్న సినిమాలలో కేవలం ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ వరుసగా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చింది. దీంతో ఫాస్ట్ గా క్రేజ్ ని సంపాదించిందో, అంతే ఫాస్ట్ గా ఆ క్రేజ్ ని పోగొట్టుకుంది కూడా.
ప్రస్తుతం ఆమె శర్వానంద్ – శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మీదనే ఆమె కోటి ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం తో పాటుగా రీసెంట్ గానే లవ్ టుడే మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యింది.
పూజ కార్యక్రమాలు కూడా గత ఏడాది జరిగింది. ఇకపోతే ఈమె సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసి ఆమె అభిమానులు ఎంతో మురిసిపోతూ ఉంటారు. రీసెంట్ గా ఈమె అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ మారింది. బ్లూ చీర లో చూపులు తిప్పుకోలేని అందం తో ఫ్యాన్స్ ని మైమరచిపోయేలా చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలకు 1 మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి.ఈ చీర ధర సుమారుగా 2 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందట.