Ravi Vemuru : ఏపీఎన్నార్టీఎస్ ఛైర్మన్‌గా డాక్టర్ రవి వేమూరు పునఃనియామకం: ఎన్నారై వర్గాల్లో హర్షం
Ravi Vemuru : ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఆర్టీ సొసైటీ (APNRTS) ఛైర్మన్‌గా డాక్టర్ రవి వేమూరు మరోసారి నియమితులయ్యారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఏపీ ఎన్నార్టీఎస్‌కు ఛైర్మన్‌గా విశేష సేవలందించిన డాక్టర్ రవి వేమూరు అనుభవాన్ని, సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు తిరిగి ఈ కీలక బాధ్యతలను అప్పగించారు.
తెనాలికి చెందిన డాక్టర్ రవి వేమూరు ఎన్నారై టీడీపీ నాయకుడిగా ప్రవాసాంధ్రుల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కాలంగా కృషి చేస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో APNRTS ద్వారా ఆయన గతంలో తనదైన ముద్ర వేసుకున్నారు. వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడం, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి బాధ్యతలను ఈ సంస్థ సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైల సహకారం తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎపిఎన్‌ఆర్‌టీ ఎస్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
రెండోసారి ఏపీఎన్నార్టీఎస్ ఛైర్మన్‌గా నియమితులైన డాక్టర్ రవి వేమూరుకు పలువురు ఎన్నారైలు, టీడీపీ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన నాయకత్వంలో APNRTS ప్రవాసాంధ్రులకు మరింత చేరువగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పునఃనియామకం ప్రవాసాంధ్ర వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తోంది.
తనపై మరోసారి నమ్మకముంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు డాక్టర్ రవి వేమూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ద్వారా ఎన్నారైలకు మరింత మెరుగైన సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఏపీఎన్నార్టీఎస్ ఛైర్మన్‌గా నియామకం అయిన డాక్టర్ రవి వేమూరు గారికి జైస్వరాజ్య టీవీ, జే.ఎస్.డబ్ల్యూ అడ్వజైర్ మరియు యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి అభినందనలు తెలిపారు. ఆయన మరెన్నో పదవుల అలంకరించాలని..మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.డాక్టర్ రవి వేమూరు నియామకంపై ‘జైస్వరాజ్య మరియు జేఎస్.డబ్ల్యూ టీవీ మీడియా’ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.