Murali Naik : ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇటీవల భారత్ పై తీవ్రంగా కాల్పులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతి అందరినీ కంటతడి పెట్టించింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన దంపతులు తమ విదేశీ పర్యటనను రద్దు చేసుకొని అమరవీరుడు మురళీ నాయక్ కుటుంబానికి ₹1.09 లక్షల విరాళాన్ని అందించడం గొప్ప మనసు చాటే పని. ఈ నిర్ణయం మురళీ నాయక్ చేసిన త్యాగానికి నిజమైన గౌరవం మాత్రమే కాదు, దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.