Hyderabad: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు జర్నలిస్టుల సన్మానం

Hyderabad: ఇటీవల టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడును మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు శనివారం జూబ్లీహిల్స్ లో సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ టీటీడీని ప్రక్షాళన చేస్తానని చెప్పారు. మొదటి బోర్డు మీటింగ్ లోనే ప్రక్షాళనకు సంబంధించి ఎన్నో కీలక అభినందనీయమని తెలిపారు.

మీడియా కుటుంబం నిర్వహించింది అభినందన సభ కాదని, ఆశీర్వాద సభ అని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనాల్లో జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా చూస్తానని ప్రకటించారు. టీటీడీ బోర్డు మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి, సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు రాంచంద్రమూర్తి, బండారు శ్రీనివాసరావు, విరాహత్ అలీ, మహా న్యూస్ సీఈవో వంశీ పాల్గొన్నారు.

TAGS